NTR: వెట్రిమారన్ మాటల్లో క్లారిటీ.. ఎన్టీఆర్‌తో సినిమా ఫిక్స్!


గత కొంతకాలంగా టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏయే డైరెక్టర్‌తో సినిమాలు చేస్తాడా అని అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. వారు ఊహించినట్లుగా తారక్ చాలా వైవిధ్యమైన డైరెక్టర్లతో కథలు సెట్ చేసుకుని సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ వచ్చే వారం రిలీజ్‌కి రెడీ అయ్యింది.

ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తమిళంలో తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్‌తో ఓ సినిమా చేయాలని ఉన్నట్లుగా తారక్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంపై తాజాగా వెట్రిమారన్ కూడా స్పందించారు. తారక్‌తో తాను ఇప్పటికే చర్చలు జరిపానని.. త్వరలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఎన్టీఆర్-వెట్రిమారన్ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి వీరి కాంబో దాదాపు ఫిక్స్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version