‘వేట్టయన్’ నాలుగు రోజుల వసూళ్లు.. ఎంతంటే?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమాలో రజినీ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దసరా బరిలో పలు సినిమాల మధ్య రిలీజ్ అయ్యింది.

తమిళ్‌లో మరే ఇతర బడా చిత్రాలు లేకపోవడంతో ‘వేట్టయన్’కు ప్లస్ అయ్యింది. కానీ, ఇతర భాషల్లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా మాత్రం ‘వేట్టయన్’ మంచి నెంబర్స్ నమోదు చేస్తోంది. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా నాలుగు రోజుల్లో ఏకంగా రూ.240 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని వారు ఆశిస్తున్నారు.

ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Exit mobile version