Vettaiyan: ‘వేట్టయన్’ టైటిల్‌పై మేకర్స్ క్లారిటీ.. అందుకే పెట్టారట!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రానికి ‘వేట్టయన్’ అనే టైటిల్ తెలుగు ఆడియెన్స్‌కి పెద్దగా కనెక్ట్ కాలేదనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపించింది.

ఇప్పుడు ఇదే విషయంపై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ‘వేట్టయన్’ చిత్రానికి తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయాలని చూసినట్లు.. అయితే, ఆ టైటిల్ అందుబాటులో లేకపోవడంతో ‘వేట్టయన్ ద హంటర్’ అనే టైటిల్‌ను పెట్టామని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. తెలుగు ఆడియెన్స్ తమ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారని.. ఇప్పుడు ఈ సినిమాను కూడా వారు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం తమకు ఉందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.

‘వేట్టయన్’ మూవీ కంటెంట్ భాషతో సంబంధం లేకుండా అందరికీ నచ్చే విధంగా ఉంటుందని వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version