తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’ ఇప్పటికే సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా, రజినీకాంత్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఓ కొత్త అప్డేట్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.
ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ అనే పాటను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటలో ఓ లెజెండరీ సింగర్ వాయిస్‌ను తీసుకొస్తున్నట్లు వారు తెలిపారు. అది ఎవరి వాయిస్ అయ్యి ఉంటుందో గెస్ చేయాలని అభిమానులను కోరారు. దీంతో ఈ వాయిస్ ఎవరిదై ఉంటుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషారా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
Bringing back the voice of a legendary singer in #MANASILAAYO ???? from VETTAIYAN ????️ Comment your guesses below. ????????#Vettaiyan ????️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/UDc3uB9adC
— Lyca Productions (@LycaProductions) September 7, 2024