వేట్టయన్ సెన్సార్ పూర్తి..రజినీ ఫ్యాన్స్‌కి పూనకాలు లోడింగ్!

తమిళ సూపర్ స్టార్ రజినీకాం్ నటిస్తున్న తాజా చిత్రం ‘వేట్టయన్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి.

కాగా, ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తన నటనతో మరోసారి రజినీకాంత్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని వారు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

Exit mobile version