“నచ్చింది గాళ్ ఫ్రెండూ” ట్రైలర్ చాలా బాగుంది – విక్టరీ వెంకటేష్

“నచ్చింది గాళ్ ఫ్రెండూ” ట్రైలర్ చాలా బాగుంది – విక్టరీ వెంకటేష్

Published on Nov 4, 2022 12:13 PM IST


ఆటకదరాశివ, మిస్ మ్యాచ్ వంటి డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గాళ్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో, అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు.ఈ నెల 11న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ లాంఛ్ చేసారు.

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, “ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఈసినిమా లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఉదయ్ శంకర్ కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాను. టీం కి నా బెస్ట్ విషెష్” అని అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, “విక్టరీ వెంకటేష్ గారు మా ట్రైలర్ ని లాంఛ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక రోజు జరిగే కథ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. దోస్తీ సాంగ్, ఎర్రతోలు పిల్ల సాంగ్స్ కి బాగా రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వెంకటేష్ గారు ట్రైలర్ ని చూసి మా టీం ని అభినందించడం మాకు కొత్త ఎనర్జీని ఇచ్చింది” అని అన్నారు.

హీరోయిన్ జెన్నీఫర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ, “వెంకటేష్ గారు మా ట్రైలర్ ని లాంఛ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మా సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. వన్డే లో జరిగే ఈ లవ్ స్టోరీ లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి” అని అన్నారు.

కమెడియన్ మధునందన్ మాట్లాడుతూ, “వెంకటేష్ గారు మా ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా టోటల్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది. వెంకటేష్ గారు కాన్సెప్ట్ విని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నవంబర్ 11న రాబోతున్న మా సినిమా ట్రైలర్ లాంఛ్ వెంకటేష్ గారు చేయడం పెద్ద పాజిటివ్ నోట్ భావిస్తున్నాము” అని అన్నారు.

నిర్మాత అట్లూరి నారాయణ మాట్లాడుతూ, “రామానాయుడు స్టూడియోస్ లో విక్టరీ వెంకటేష్ గారి చేతులు మీదుగా నచ్చింది గాళ్ ఫ్రెండూ ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. విక్టరీ వెంకటేష్ గారు మా ట్రైలర్ చూసి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. యూత్ ఫుల్ కంటెంట్ గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ కి సిద్దం అవుతుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.

ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సిద్దం మనోహార్, మ్యూజిక్ గిఫ్టన్, ఎడిటర్ జునాయిద్ సిద్దిఖి, ఆర్ట్ దొలూరి నారాయణ, పి.ఆర్.ఓ జియస్ కె మీడియా, నిర్మాత అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం గురు పవన్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు