లేటెస్ట్ పిక్ : సూపర్ కూల్ లుక్ లో విక్టరీ వెంకటేష్

Published on Feb 4, 2023 6:00 pm IST


టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఇటీవల అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తన కెరీర్ 75వ సినిమా సైంధవ్ లో హీరోగా నటిస్తున్నారు వెంకటేష్. ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, నేడు ఒక చిన్నారితో కలిసి విక్టరీ వెంకటేష్ దిగిన పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పిక్ లో వెంకటేష్ రఫ్ గడ్డం, గ్లాసెస్ తో సూపర్ స్టైలిష్ కూల్ లుక్ లో అదరగొట్టారు అనే చెప్పాలి. ఇక సైంధవ్ తో పాటు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కిసి కా భాయ్ కిసి కా జాన్ లో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఈద్ పండుగ నాడు గ్రాండ్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. మొత్తంగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ కెరీర్ పరంగా మంచి జోష్ తో దూసుకెళ్తున్నారు అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :