గ్రాండ్‌గా విజయ్ 69 మూవీ లాంచ్!

తమిళ స్టార్ హీరో విజయ్ రీసెంట్‌గా ‘ది గోట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా, స్పై థ్రిల్లర్‌గా ఈ మూవీ మిక్సిడ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే, ఈ సినిమా తరువాత విజయ్ తన లాస్ట్ మూవీలో నటిస్తాడని అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేశారు.

దర్శకుడు హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా తెరకెక్కించేందుకు కేవీయన్‌ ప్రొడక్షన్స్ సిద్ధమైంది. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉందంటున్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ.

ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యలర్ షూటింగ్ శనివారం నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version