ఆకట్టుకుంటున్న విజయ్ – సమంత ల డాన్స్!

ఆకట్టుకుంటున్న విజయ్ – సమంత ల డాన్స్!

Published on Aug 15, 2023 11:53 PM IST


విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ చిత్రం పాటలు మరియు ట్రైలర్‌తో సందడి చేసింది. ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన పాటలు సినిమా పై హైప్‌ని బాగా పెంచాయి. ఈ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కి సంబందించిన మ్యూజికల్ కన్సర్ట్ ఈరోజు హైదరాబాద్‌లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది.

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మరియు సమంత ల డాన్స్ పర్ఫార్మెన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత మరియు విజయ్ డాన్స్ చాలా బాగుంది. సాధారణంగా ఇలాంటి ప్రమోషన్లు బాలీవుడ్ స్టార్స్ చేస్తుంటారు, అందుకే విజయ్, సమంతల డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు