సంగీత దర్శకునిగా ఎంటర్ అయ్యి హీరోగా ఆ తర్వాత దర్శకునిగా కూడా మారిన మల్టీ టాలెంటెడ్ టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ ఆంటోనీ అని చెప్పొచ్చు. మన తెలుగు ఆడియెన్స్ కి “బిచ్చగాడు” సినిమాతో సెన్సేషన్ గా మారిన తాను అక్కడ నుంచి దాదాపు అన్ని సినిమాలు మన తెలుగులో రిలీజ్ కి తీసుకొస్తున్నాడు. అయితే కొంచెం గ్యాప్ తర్వాత తన నుంచి వస్తున్నా లేటెస్ట్ సినిమా అందులోని తన కెరీర్ 25వ సినిమా తాలూకా టైటిల్ ని ఇపుడు అనౌన్స్ చేసాడు.
మరి ఆ చిత్రమే “పరాశక్తి”. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమాని రివీల్ చేసి తన నుంచి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అన్నట్టుగా తెలిపాడు. అలాగే ఈ చిత్రాన్ని దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా తన కెరీర్లో బెంచ్ మార్క్ చిత్రంగా వచ్చి హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.