‘గగన మార్గన్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న విజయ్ ఆంటోని

‘గగన మార్గన్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న విజయ్ ఆంటోని

Published on Oct 16, 2024 11:59 AM IST

తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించే సినిమాలను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ హీరో వరుసగా సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. విజయ్ ఆంటోని తన నెక్స్ట్ మూవీపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని ఇచ్చాడు.

తన నెక్స్ట్ మూవీ ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని.. ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఎగ్జైటింగ్‌గా ఉండబోతుందని విజయ్ ఆంటోని చెబుతున్నాడు. ఇక ఈ సినిమాకు ‘గగన మార్గన్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేయగా, తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ ఎడిటర్ లియో జాన్ పాల్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారుతున్నాడు.

విజయ్ ఆంటోని సొంత బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్ నుంచి వస్తున్న 12వ చిత్రంగా ‘గగన మార్గన్’ నిలవనుంది. విజయ్ ఆంటోని సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముధ్రఖని, ప్రితిక, బ్రిగిడ సాగా, వినోద్ సాగర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు