“పరాశక్తి” టైటిల్ కాంట్రవర్సీ.. విజయ్, శివ కార్తికేయన్ ల పరిస్థితేంటి?

“పరాశక్తి” టైటిల్ కాంట్రవర్సీ.. విజయ్, శివ కార్తికేయన్ ల పరిస్థితేంటి?

Published on Jan 30, 2025 10:05 AM IST

ఊహించని విధంగా ఒకే టైటిల్ తో రెండు సినిమాలు అనౌన్స్ అవ్వడం అనేది ఒకింత ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. కోలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోలు అది కూడా మన తెలుగులో మంచి ఆదరణ ఉన్న వారే విజయ్ ఆంటోనీ ఇంకా శివ కార్తికేయన్ లు నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు ఒకే టైటిల్ తో అనౌన్స్ కావడం అనేది ఊహించని ట్విస్ట్ గా మారింది.

అయితే విజయ్ ఆంటోనీ చిత్రం తమిళ్ లో ఒక టైటిల్ పెట్టినప్పటికీ తెలుగు సహా ఇతర భాషల్లో మాత్రం “పరాశక్తి” అంటూ అనౌన్స్ చేశారు. ఇది అనౌన్స్ అయ్యిన కొన్ని గంటలకే శివ కార్తికేయన్, సుధా కొంగర సినిమా కూడా ఇదే టైటిల్ తో అనౌన్స్ అవ్వడం తమిళ ఆడియెన్స్ కి సహా తెలుగు ఆడియెన్స్ లో కూడా ఒకింత షాకింగ్ గా మారింది.

అయితే దీనిపై విజయ్ ఆంటోనీ తాను తన సినిమాకి సౌత్ సినిమా ఛాంబర్ లో ఎప్పుడో పరాశక్తి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాను అని ఒక నోట్ కూడా రివీల్ చేశారు. కానీ ఇంకో పక్క శివ కార్తికేయన్ సినిమాకి సుధా కొంగర అండ్ టీం పరాశక్తి అనే టైటిల్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ నుంచి అధికారికంగా తీసుకున్నారని అందుకు తాము ఈ టైటిల్ ని అనౌన్స్ చేసుకున్నారు.

అయితే విజయ్ ఆంటోనీ తమిళ్ వెర్షన్ లో వేరే టైటిల్ పెట్టి ఇతర భాషలకి ఈ టైటిల్ ని పెట్టడంతో ఇపుడు అంతా గందరగోళంగా మారింది. మరి మిగతా భాషల్లో ఏమో కానీ తెలుగు వెర్షన్ కి మాత్రం ఈ రెండు సినిమాల టైటిల్స్ లో ఎవరు తగ్గుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు