కొత్త సినిమా తప్పకుండా నచ్చుతుందంటున్న విజయ్

కొత్త సినిమా తప్పకుండా నచ్చుతుందంటున్న విజయ్

Published on May 26, 2021 1:24 AM IST

తమిళ హీరో విజయ్ ఆంటోనీ సినిమాలకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఆ సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన ప్రతి చిత్రం తెలుగులోకి అనువాదం అవుతూనే ఉంది. అయితే విజయ్ ఆంటోనీ నుండి ఈమధ్య సినిమాలేవీ రాలేదు. ఆయన కొత్త సినిమాలన్నీ మేకింగ్ దశలోనే ఉన్నాయి. వాటిలో ‘అగ్ని సిరగుగల్’ కూడ ఒకటి. ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉంది.

ఈ చిత్రం మీద విజయ్ ఆంటోనీ చాలా నమ్మకంగా ఉన్నారు. నవీన్ ఈ సినిమాకు దర్శకుడు. నవీన్ మొదటిరోజు నుండి తనను ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడని, అతని స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుందని, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని, సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు. అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి.శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికైతే ఈ సినిమా యొక్క తెలుగు డబ్బింగ్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. మరి రిలీజ్ డేట్ ప్రకటించే సమయానికి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డబ్బింగ్ హక్కుల్ని కొనుగోలు చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు