తమిళ హీరో విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన నటించిన బిచ్చగాడు సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక విభిన్నమైన కథలతో సినిమాలు చేసే విజయ్ ఆంటోనికి ఇక్కడ ఫాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం తుఫాన్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
తాజాగా తుఫాన్ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన తుఫాన్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. సినిమా కథకు సంబంధించి ట్రైలర్ లో ఆసక్తిని క్రియేట్ చేశారు. గతం గుర్తులేని వ్యక్తిగా విజయ్ ఆంటోని ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా ఇందులో కనిపించారు. ఇక విజయ్ ఆంటోని కొత్త లుక్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు.
విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేస్తున్న తుఫాన్ మూవీలో సత్యరాజ్, మేఘ ఆకాష్, డాలి ధనంజయ, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.