‘ఫైటర్’తో నా బాలీవుడ్ ఎంట్రీ జరగదంటున్న విజయ్ దేవరకొండ

‘ఫైటర్’తో నా బాలీవుడ్ ఎంట్రీ జరగదంటున్న విజయ్ దేవరకొండ

Published on Oct 22, 2020 1:11 AM IST

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై తెలుగులోనే కాదు హిందీలో కూడ మంచి హైప్ ఉంది. పూరి దర్శకుడిగా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ హిందీ ప్రేక్షకుల్లో కూడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా కరణ్ జోహార్ సినిమాకు సహ నిర్మాత కావడం హిందీలో మంచి హైప్ తెచ్చి పెట్టింది. తెలుగుతో పాటు దేవరకొండ మొదటిసారి నేరుగా చేస్తున్న హిందీ చిత్రం కావడంతో ఇదే ఆయన బాలీవుడ్ ఎంట్రీ చిత్రమని అందరూ భావిస్తున్నారు.

కానీ దేవరకొండ వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. ‘ఫైటర్’ చిత్రాన్ని హిందీలో తనకు డెబ్యూ చిత్రమని భావిండం లేదని, అసలు బాలీవుడ్ అనేది ఇండియాలో సపరేట్ పరిశ్రమ అని తాను అనుకోవడం లేదని, ఇండియాలోని సినీ పరిశ్రమలన్నీ ఒక్కటేనని, ‘ఫైటర్’ అనేది తనకొక మంచి, థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి దేవరకొండ ఆలోచనా ధోరణి కొత్తగాను, సమంజసంగాను ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ తండ్రిగా స్టార్ నటుడు సునీల్ శెట్టి నటిస్తారనే ప్రచారం కూడ జరుగుతుండగా చిత్ర బృందం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు