“కల్కి” పై విజయ్ దేవరకొండ ప్రశంసలు!

“కల్కి” పై విజయ్ దేవరకొండ ప్రశంసలు!

Published on Jun 27, 2024 5:30 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. నేడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి వచ్చింది. దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించిన విజయ్ దేవరకొండ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాగి, ప్రభాస్ అన్న, వైజయంతీ ఫిల్మ్స్, మీ అందరి పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఈ ప్రేమ, విజయం మరియు శక్తికి అర్హులు. అమితాబ్ బచ్చన్ సర్, దీపికా పదుకునే, కమల్ హాసన్ సర్ లకు నా గౌరవాలు. మీరు లేకుండా కల్కి ఇలాగే ఉండేది కాదు. మనమందరం పోయిన తర్వాత కల్కి2898AD గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు