ఆనంద్ కి విజయ్ దేవరకొండ బర్త్ డే విషెస్!


టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి చిత్రం తో యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించడం లో విజయ్ ముందు వరుస లో ఉంటాడు. విజయ్ దేవరకొండ తమ్ముడైన ఆనంద్ దేవరకొండ కూడా మంచి స్క్రిప్టు లను సెలెక్ట్ చేసుకుంటూ, సినిమాలు చేస్తున్నారు. నేడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదిక గా బర్త్ డే విషెస్ తెలిపారు.

నేను ఫైట్ కి తీసుకొని వెళ్ళే మొదటి అబ్బాయి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. బ్రదర్ బాయ్ ఆనంద్ దేవరకొండ, ఐ లవ్ యూ మోస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఒక ఫోటోను కూడా షేర్ చేశారు విజయ్. ఇందులో ఇద్దరూ కూడా తమ మజిల్స్ ను చూపిస్తున్నారు. ఫోటో అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ (vijay devarakonda) తదుపరి ఫ్యామిలీ స్టార్ (family star) మూవీ లో కనిపించనున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version