బోట్ రైడ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లోని 12వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే, తాజాగా విజయ్ దేవరకొండ బోట్ రైడ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. తనదైన లుక్స్‌తో విజయ్ దేవరకొండ మనకు ఈ వీడియోలో కనిపించాడు. చాలా స్పీడుగా, మంచి ఎక్స్‌పర్ట్‌లాగా రయ్యిరయ్యి మంటూ బోటుతో నీటిపై దూసుకెళ్లాడు. తమ అభిమాన హీరో ఇలా నీటిపై బోటు రైడింగ్ చేస్తుండటం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆయన సరికొత్త లుక్‌తో కనిపించనున్నాడు. అందాల భామ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version