చిరంజీవిని ఫాలో అవుతున్న దేవరకొండ

Published on Aug 1, 2020 10:54 am IST

నటుడిగా ఎంత గొప్ప పేరుందో, మానవతావాదిగా చిరంజీవికి అంతే పేరుంది. స్టార్ గా ఎదిగిన తరువాత చిరంజీవి తనను అభిమానిస్తూ ఆ స్థాయికి తీసుకెళ్లిన ప్రజలకు ఏమైనా చేయాలనే సంకల్పంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఏళ్లుగా నిస్సహాయులకు సేవ చేస్తున్నారు. సేవా గుణం చిరంజీవి ఇమేజ్ పెంచిన అంశాలలో ఒకటి. ఇక కరోనా సమయంలో కూడా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి వారిని ఆదుకోవడం జరిగింది.

కాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం చిరంజీవిని ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్ పేరుతో టాలెంటెడ్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ మరియు ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారికోసం మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో పేదలకు సాయం చేయడం జరిగింది. తాజాగా కరోనా రోగుల చికిత్సకు అవసరమయ్యే ప్లాస్మా దానం చేసిన దాతలను దేవరకొండ స్వయంగా కలిసి సన్మానించడం జరిగింది. చూస్తుంటే దేవరకొండ ఈ విషయంలో చిరంజీవిని ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More