విజయ్, గౌతమ్ సినిమా మామూలుగా ఉండదట!

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా ఒకటి. ఇది విజయ్ కెరీర్లో 12వ సినిమాగా తెరకెక్కిస్తుండగా పూర్తిగా మాస్ లెవెల్లో సాలిడ్ ఎమోషన్స్ తో ఈ సినిమాని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ మరిన్ని అంచనాలు పెంచాయి.

ఈ సినిమా డెఫినెట్ గా ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది అని బలంగా చెబుతున్నారు. అసలు జెర్సీ లాంటి సాఫ్ట్ సబ్జెక్టు తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నుంచేనా ఈ రేంజ్ సినిమా వచ్చింది అని అంతా ఆశ్చర్యపోయేలా ఉంటుంది అని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా కూడా వాటికి మించే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలిపారు. దీనితో విజయ్ అభిమానుల్లో ఈ సినిమా పట్ల మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version