ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ?

ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ?

Published on Nov 15, 2022 11:18 PM IST

vijay 1
యంగ్ సెన్సేషన్, పాన్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఖుషీ తో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో యశోద నటి సమంత కథానాయిక గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ కి తెలుగు లో మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టులో ప్రకటించిన వృషభలో అర్జున్ రెడ్డి నటుడు మోహన్‌లాల్ కొడుకుగా నటించనున్నాడు.

చిత్ర దర్శకుడు నంద కిషోర్ విజయ్ తో కీలక పాత్రలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మోహన్‌లాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామా వృషభ 2023 లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది మలయాళం మరియు తెలుగులో చిత్రీకరించబడుతుంది. ఈ చిత్రం 2024 లో విడుదల కానుంది.

తాజా వార్తలు