ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ మాస్ రిప్లై..


మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” అనుకున్న రేంజ్ హిట్ అయితే కాలేదు. కానీ ఇదే ఏడాదిలో విజయ్ నుంచి ఒక ఊహించని సర్ప్రైజ్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో చేసిన సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898 ఎడి” లో పవర్ ఫుల్ పాత్ర అర్జునిడిగా తాను చేసాడు. అయితే ఈ పాత్ర విషయంలో విజయ్ కి అనేక ప్రశంసలుతో పాటుగా ట్రోల్ తాకిడి కూడా ఎక్కువ అయ్యింది.

మరి దీనితో విజయ్ వారి అందరికి ఎలా సమాధానం ఇవ్వాలో అలానే సమాధానం ఇచ్చాడు. అర్జునిడి రోల్ లో విజయ్ ని చూసి కామెంట్స్ చేసిన వారి అందరికీ చెంపపెట్టు లా అదే లుక్ ని తన సోషల్ మీడియా అన్ని ప్లాట్ ఫామ్ లలో కూడా తాను అదే లుక్ పిక్ ని డీపీ గా పెట్టుకున్నాడు. దీనితో మీరెన్ని ట్రోల్స్ చేసుకున్నా నాకు అనవరసం అన్నట్టు ఇదే పెడతా అనే రేంజ్ లో విజయ్ సమాధానం ఇచ్చాడు. దీనితో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

Exit mobile version