అఫీషియల్ : విజయ్ దేవరకొండ – పరశురామ్ లతో దిల్ రాజు కొత్త సినిమా అనౌన్స్ మెంట్

Published on Feb 5, 2023 10:38 pm IST


విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా 2018లో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన సినిమా గీత గోవిందం. ఆ మూవీ తో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు పరశురామ్ అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఇటీవల సర్కారు వారి పాట మూవీ తెరకెక్కించి మరొక విజయం అందుకున్నారు. అయితే విషయం ఏమిటంటే, దాదాపుగా ఐదేళ్ల తరువాత మరొక్కసారి విజయ్ దేవరకొండ, పరశురామ్ ల క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది.

కాగా వీరిద్దరి కాంబో సినిమాని దిల్ రాజు, శిరీష్ లు ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఆకట్టుకునే సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా విజయ్ మొదటి సారి దిల్ రాజు, శిరీష్ ల ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్లో పని చేయనుండడంతో దీని పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన విషయాలని ఈ రోజు అధికారికంగా ప్రకటించగా ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల మరియు ఇతర వివరాలని త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం :