విజయ్ ప్లాప్ సినిమాకి హిందీలో సెన్సేషనల్ రెస్పాన్స్

విజయ్ ప్లాప్ సినిమాకి హిందీలో సెన్సేషనల్ రెస్పాన్స్

Published on Jun 15, 2024 3:00 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని అందుకోలేకపోయాడు. అయితే విజయ్ కెరీర్ లో కొన్ని ప్లాప్ లు ఉన్నప్పటికీ వాటిలో కొంచెం లేట్ గా మంచి ఆదరణ అందుకున్న చిత్రాల్లో ఒకటి “డియర్ కామ్రేడ్”. దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది.

మరి ఈ సినిమా తెలుగులో ప్లాప్ గానే నిలిచింది కానీ హిందీ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. అలా తాజాగా ఈ సినిమా ఈ సినిమా ఏకంగా 400 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. దీనితో ఈ సినిమాని నార్త్ లో జనం ఏ రేంజ్ లో చూసారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరితో భారీ సినిమా చేస్తుండగా రష్మిక కూడా పాన్ ఇండియా వైడ్ గా అనేక సినిమాలతో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు