VD12: మళ్లీ షూట్ మోడ్‌లోకి విజయ్ దేవరకొండ..?

VD12: మళ్లీ షూట్ మోడ్‌లోకి విజయ్ దేవరకొండ..?

Published on Sep 22, 2024 1:14 AM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన తన కెరీర్‌లోని 12వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతమేర జరుపుకుంది. కాగా, ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన యూనిట్, ఇప్పుడు తిరిగి కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఈ షెడ్యూల్ 15 రోజులపాటు చిత్రీకరణ జరుపుకోనుందట. ఈ షెడ్యూల్‌లో హీరో విజయ్ దేవరకొండ కూడా జాయిన్ అవుతారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ షెడ్యూల్‌ను కేరళలోని కొన్ని వింటేజ్ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ చివరినాటికి ముగించేయాలని మేకర్స్ భావిస్తున్నారు. వీలైనంత త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు