టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ సాలిడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీకి సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ చిత్రాన్ని క్లాసిక్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో చేయబోతున్నాడట. గతంలో ఇంద్రగంటి ‘జటాయు’ అనే పవర్‌ఫుల్ కథను విజయ్‌కి నెరేట్ చేశారని.. ఇప్పుడు ఈ సినిమాను తన నెక్స్ట్ చిత్రంగా విజయ్ తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా టైటిల్ ‘జటాయు’ మాత్రమే కాదు.. ఇందులో విజయ్ చేయబోయే పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సినీ సర్కిల్స్ టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.