నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ‘జాతిరత్నాలు`. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా పరిచయ మవుతున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్బంగా జాతి రత్నాలు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై జాతిరత్నాలు బిగ్ టికెట్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరై ఈవెంట్‌ని గ్రాండ్ సక్సెస్ చేశారు.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘కాకతీయ.. వరంగల్.. ఇక్కడున్న ప్రతీ ఒక్కరికీ.. అక్కడున్న ప్రతీ ఒక్కరికీ.. మీ అందరూ కనిపిస్తున్నారు.. ఐ లవ్యూ ఆల్.. ఈ రోజు మార్నింగ్ నాగీ నుంచి మెసెజ్ వచ్చింది.. సినిమా పూర్తి అయింది.. నువ్ త్వరగా రావాలి అన్నాడు.. ఇక్కడికి రావడం నాకెంతో సంతోషంగా ఉందని అన్నాను.. ఇంత మందిని కలిసే అవకాశం వచ్చింది.. ఏడాది నుంచి మీ అందరినీ చూడలేదు.. ఈరోజు నేను నటుడిని కాలేకపోయినా ఇక్కడకి వచ్చేవాడిని.. మీలా అక్కడ కూర్చుని చూసేవాడిని.. యాక్టర్‌ని అయ్యాను కాబట్టి ఇక్కడ నిల్చున్నా. సినిమా అంటే ఒక ఎకానమీ.. ఓ డైరెక్టర్ కథ రాస్తే.. నిర్మాత ఓకే చేసి. హీరో సైన్ చేస్తే.. యాక్టర్ స్టాఫ్.. లైట్స్ మెన్.. మ్యూజిక్ డైరెక్టర్.. మ్యూజిషియన్స్.. డ్రైవర్లు, క్యాస్టూమ్ డిజైనర్లు ఇలా అందరూ సినిమా మీద ఆధారపడి ఉన్నాం.. బాంబేకి వెళ్లినా అక్కడి వారు మన గురించి మాట్లాడతారు. ఫ్యాన్స్ ఎక్కడా లేరు..
కాలర్ ఎగరేసి చెబుతున్నా.. ఈ రోజు ఈ అవకాశాన్ని ఉపయోగించి ఇది చెప్పాలని అనుకున్నాను. ఇక్కడున్న వారంతా నా ఫ్రెండ్స్. నా జీవితంతో ఏదో ఒకలా ప్రతీ ఒక్కరూ ముడిపడి ఉన్నారు.. కలిసి కలలు కన్నాం.. కష్టాలు చెప్పుకున్నాం.. నవ్వించారు.. ధైర్యమిచ్చారు..వంద వంద వేసుకుని తిన్నాం తాగాం.. దర్శిలేకపోతే పెళ్లి చూపుల్లో ప్రశాంత్ లేడురా.. దర్శి ఇప్పుడు అన్ని ఫ్లాట్‌ఫాంలో చేస్తున్నాడు..ప్రతీ రోజూ బిజీగా ఉంటున్నాడు.. శివ లేకపోతే అర్జున్ లేడు. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం నాగ్ అశ్విన్.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చేసేటప్పుడు చిన్న చిన్న రోల్స్ ఇచ్చేవాడు.. యాడ్ ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకున్నాడు.. ఎవడే సుబ్రహ్మణ్యంలో కొట్లాడి మరీ రోల్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నాగీ. ఇలా ఉండు అలా ఉండు.. అందరిలా ఉండు అనే వాడు కాదు.. నీలా ఉండు అని చెప్పేవాడు.. ఫస్ట్ ప్రమోషన్స్‌కి వెళ్లేటప్పుడు గుర్తుండిపోయే మెమోరీ ఇవ్వమని నాగీ చెప్పాడు. ఇప్పటికీ అదే గుర్తు పెట్టుకున్నాం.. మధ్య మధ్యలో అనుదీప్ షార్ట్ ఫిలిమ్ చూపించి నవ్వించేవాడు. మా అందరి కంటే మంచి నటిలా ఉన్నావ్.. మా మొదటి సినిమాలో నీ అంత యాక్టింగ్ చేయలేదు.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నన్ను నటుడిగా వైజయంతీ మూవీస్ లాంచ్ చేసింది.. ఇలా ఫ్రెండ్స్ అందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం.. కన్న కలలన్నీ కూడా నిజం కావడం ఎంతో గొప్పగా ఉంది.. మార్చి 11న జాతి రత్నాలు.. వెళ్లండి.. చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు
నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. హలో వరంగల్ థ్యాంక్యూ.. అందరూ కనిపిస్తున్నారు.. మాస్క్‌లు వేసుకుని అందరూ జాగ్రత్తగా ఉండండి.. ఈ సినిమాను సంవత్సరం పాటు రిలీజ్ చేయకుండా ఉంచుకున్నాం.. ఇలాంటి ఫీలింగ్ కోసమే రెండేళ్లు మా దగ్గరే పెట్టుకున్నాం. ఇప్పుడు థ్యాంకింగ్ ప్రోగ్రాం పెట్టొద్దని అనుదీప్ అన్నాడు.. రాహుల్, దర్శి, రధన్, ఫరియా.. కొన్ని సినిమాలు అలా కలిసి వస్తాయ్.. నవీన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి పాత్రలు చేసినా వాటికి తగ్గట్టు ఉంటాడు.. ఏజెంట్ పాత్ర చేస్తే ఏజెంట్లా.. జోగిపేట కుర్రాడిలా.. ఇలా ఏ పాత్ర చేసినా అలానే కనిపిస్తాడు.. విజయ్ కూడా అంతే.. ఒకే నాణెనికి రెండు వైపులున్నట్టు ఉంటారు.. ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్ విజయ్. ఏసీపీ జితేందర్ గారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద ఈవెంట్‌ను జాగ్రత్తగా నిర్వహించినందుకు థ్యాంక్స్’ అని ఆయనకు శానిటైజ్డె బొకేను అందించారు. ఇక డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమా కోసం పని చేసిన వారందరి గురించి నాగ్ అశ్విన్ వివరించారు.