దేవరకొండ తపనంతా పూరి సినిమా కోసమేనా ?

Published on Dec 3, 2019 6:43 pm IST

ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ త్వరలో విజయ్ దేవరకొండతో సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మీలు పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దుతున్నారట. హిందీలో భారీగా రిలీజ్ చేయడం కోసం హిందీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పూరి టచ్లో ఉన్నారట.

పూరికి తోడుగా విజయ్ దేవరకొండ సైతం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. మొదటి నుండి బాలీవుడ్ మీద ఆసక్తి చూపుతున్న విజయ్ ఇప్పుడు మరింత అడ్వాన్స్ అయ్యాడు. అక్కడి మీడియాకు చాలా దగ్గరగా ఉంటూ హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారే పనిలో ఉన్నాడు. సినిమా కోసం విజయ్ ఇప్పటి నుండే కష్టపడటం అభినందించదగిన విషయమే. మార్కెటింగ్లో ఆరితేరిపోయున్న విజయ్ ముందు ముందు బాలీవుడ్ మీద ఎలాంటి అస్త్రాలు ప్రయోగిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More