టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైంది. నిన్ను కోరి, మజిలీ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ గురించి హీరో విజయ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
2 నిమిషాల 41 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ త్వరలో విడుదల కానుండగా, సెన్సార్ బోర్డ్ U సర్టిఫికేట్ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడాకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్ 1, 2023న పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.