విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఆ యంగ్ డైరెక్టర్ తో ఫిక్స్ ?

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఆ యంగ్ డైరెక్టర్ తో ఫిక్స్ ?

Published on Mar 20, 2024 3:00 AM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ పెట్లతో ఫ్యామిలీ స్టార్ మూవీతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. వీటిలో ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 న రిలీజ్ కానుండగా గౌతమ్ తీస్తున్న మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. విషయం ఏమిటంటే, ఈ రెండిటి అనంతరం ఇటీవల రాజా వారు రాణి గారు మూవీతో మంచి విజయం అందుకున్న రవికిరణ్ కోలా తో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ చేయనునట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క ప్రీప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోందట. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగె పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ సాగనుండగా, గౌతమ్ తిన్ననూరితో విజయ్ తన సినిమాను ముగించిన వెంటనే ఇది సెప్టెంబర్ చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈమూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు