రిచ్ “ఫ్యామిలీ స్టార్”..?

రిచ్ “ఫ్యామిలీ స్టార్”..?

Published on Mar 13, 2024 9:00 AM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం “ఫ్యామిలీ స్టార్”. మరి ఇప్పుడు వరకు వచ్చిన టీజర్ మరియు పాటలు అదరగొట్టగా నిన్ననే వచ్చిన రెండో సాంగ్ కి అయితే మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఇదే సాంగ్ విషయంలో మరో కోణం కూడా వినిపిస్తుంది. ఈ ఫ్యామిలీ స్టార్ మిడిల్ క్లాస్ అనుకుంటే ఇంత రిచ్ గా కనిపిస్తున్నాడేంటి అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోస్టర్, సాంగ్ విజువల్స్ చూస్తేనే ఈ సాంగ్ ని చాలా రిచ్ అండ్ గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. దీనితో ఇక్కడ మేకర్స్ లాజిక్ మిస్ అయ్యారని కొందరు అంటున్నారు.

అయితే ఇక్కడ సినిమాలో విజయ్ ని ఓ సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ గానే చూపించారు కానీ మిడిల్ క్లాస్ నుంచి ఈ రేంజ్ లో పెళ్లి చేసుకోకూడదు అని ఎక్కడైనా ఉందా? అలా ఏ సందర్భంలో అయ్యిందో కూడా తేలీదుగా? అని మరికొందరు అంటున్నారు. మరి సినిమాలో పరశురామ్ పెట్ల ఈ లాజిక్ ని ఎలా బ్యాలన్స్ చేసాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 5న సినిమా తెలుగు తమిళ్ లో రిలీజ్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు