విజయ్ – గౌతమ్ తిన్ననూరి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే?

విజయ్ – గౌతమ్ తిన్ననూరి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే?

Published on Jan 2, 2024 10:05 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్ కమిట్ అయిన మూవీ VJ12. జెర్సీ మూవీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చ్ నెలలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ శ్రీ లీల మరియు విజయ్ మార్చ్ నెల నుండి టీమ్ కి అందుబాటులో ఉండనున్నారు. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు