అఫీషియల్: పొంగల్ 2026 రేస్‌లో విజయ్ ‘జన నాయగన్’

అఫీషియల్: పొంగల్ 2026 రేస్‌లో విజయ్ ‘జన నాయగన్’

Published on Mar 24, 2025 6:27 PM IST

తమిళ స్టార్ హీరో థళపతి విజయ్ నటిస్తు్న్న లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పొలిటికల్ డ్రామా చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి.

కాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని 2026 పొంగల్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు వారు తెలిపారు. 2026 జనవరి 9న ‘జన నాయగన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక విజయ్‌కు పొంగల్ రేస్ ఎంతో కలిసి వచ్చే అంశం. దీంతో ఆయన అభిమానులు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు