విజయ దేవరకొండ సెన్సషన్స్ కొనసాగుతూనే ఉన్నాయ్. ఈ రౌడీ హీరో కి యూత్ లో పాపులారిటీ అమాంతం పెరుగుతూ పోతుందనడానికి తాజా ఉదంతమే ఉదాహరణ. అసలు విషయం ఏమిటంటే ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ఈ సంవత్సరం ప్రకటించి న “మోస్ట్ డెసైరబుల్ మెన్” ర్యాంకింగ్స్ లో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఏకంగా 4వ ర్యాంక్ పొందాడు. విజయ్ కి ముందు రణబీర్ సింగ్ మూడవ ర్యాంక్..,వెనుక క్రికెటర్ విరాట్ కోహ్లీ 5వ ర్యాంక్లో ఉండటం మరో విషయం. గత సంవత్సరం బాహుబలి క్రేజ్ తో ఏకంగా 2 వ ర్యాంక్ లో ఉన్న ప్రభాస్ ఈ సారి 12వ ర్యాంక్ కి పడిపోయారు. అలాగే రానా దగ్గుబాటి 19వ ర్యాంక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇంకా టాలీవుడ్ హీరో లలో ఎవరికీ ఈ లిస్ట్ లో చోటు దక్కలేదు. ప్రిన్స్ మహేష్ మాత్రం “ఫర్ ఎవర్ డెసైరబుల్”గా నామినేట్ కావడం జరిగింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హృతిక్, రణ్వీర్ వంటి హేమాహేమీలను వెనక్కునెట్టి మొదటి ర్యాంక్ సాధించాడు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విజయ్ దేవరకొండ కి ఇది పెద్ద విజయమే అని చెప్పాలి.