మొదటి రోజే భారీ వసూళ్లు కొల్లగొట్టేసిన తెలుగు “మాస్టర్”.!

Published on Jan 14, 2021 11:00 am IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా నటించిన తాజా చిత్రం “మాస్టర్”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కాబడింది. ఒక్క మన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల అయ్యింది.

అయితే ఈ చిత్రానికి అన్ని చోట్ల లానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశించారు. మరి అందుకు తగ్గట్టుగానే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో భారీ వసూళ్లే కొల్లగొట్టినట్టుగా పి ఆర్ లు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 5.74 రాబట్టేసిందట. దీనితో మొదటి రోజే ఏకంగా 80 శాతం వసూళ్లను ఈ చిత్రం రాబట్టేసిందని చెబుతున్నారు. ఇక ఏరియాల వారీగా వసూళ్లు చూసుకున్నట్టయతే..

నైజాం – 1.49 కోట్లు
సీడెడ్ – 1.1 కోట్లు
వైజాగ్ – 83 లక్షలు
పశ్చిమ గోదావరి – 56 లక్షలు
తూర్పు గోదావరి – 48 లక్షలు
గుంటూరు – 67 లక్షలు
కృష్ణ – 36 లక్షలు
నెల్లూరు – 25 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం – 5.74 కోట్లు “మాస్టర్” రాబట్టింది. ఇది ఒక సెన్సేషనల్ ఓపెనింగ్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More