“పుష్ప” లో రోల్ నేను రిజెక్ట్ చేయలేదు – విజయ్ సేతుపతి

“పుష్ప” లో రోల్ నేను రిజెక్ట్ చేయలేదు – విజయ్ సేతుపతి

Published on Jun 17, 2024 5:00 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ. తన 50 వ చిత్రంగా తెరకెక్కిన మహారాజ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల, సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ సేతుపతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పుష్ప చిత్రం లో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల అందులో నటించలేదు. అయితే ఇదే ప్రశ్నను ఒక విలేఖరి అడిగారు. తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. సైరా తర్వాత ఉప్పెన వరకూ గ్యాప్ తీసుకున్నారు. అందుకు విజయ్ సేతుపతి సమాధానం ఇస్తూ, సీరియస్ గా ట్రై చేశాను, కానీ ఎవ్వరూ నాకు ఇవ్వలేదు అని అన్నారు.

పుష్ప చిత్రం గురించి విలేఖరి మాట్లాడుతూ, అప్పట్లో ఒక టాక్ నడిచింది. పుష్ప లో రోల్ రిజెక్ట్ చేశారని, నిజమేనా? అని అడగగా, నేను రోల్ రిజెక్ట్ చేయలేదు. అన్ని చోట్ల, అన్ని టైమ్ లలో నిజాలు చెప్పొద్దు. కొన్ని అబద్ధాలు చెప్పడం మంచిది అని విజయ్ సేతుపతి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు