ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వస్తున్న ఈ చిత్రం తర్వాత చరణ్ తన కెరీర్ 16వ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానాతో రీసెంట్ గానే తాను స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా కోసం మేకర్స్ ఆల్రెడీ గ్రాండ్ ప్లానింగ్స్ చేస్తున్నారు.
మరి వీటిలో సాలిడ్ తారాగణం కూడా ఉంది. అయితే గతంలో కూడా కోలీవుడ్ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఉన్నారని టాక్ వచ్చింది కానీ తాను లేను అని అపుడు “మహారాజ” ప్రమోషన్స్ లోనే తాను క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత “విడుదల పార్ట్ 2” తో వస్తుండగా ఈ ప్రమోషన్స్ లో మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తాను చేశారు.
ఈ సినిమాలో తాను లేనని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. నేను ఇతర సినిమాల్తో బిజీగా ఉన్నాను పైగా ఈ సినిమా కథ తనకి తెలుసు కానీ తనకి తగ్గ పాత్ర ఈ సినిమాలో సరిపోయేలా లేదు అంటూ కీలక కామెంట్స్ చేశారు. అంటే ఈ సినిమాకి తనని అప్రోచ్ అయ్యింది మాత్రం నిజమే అని చెప్పాలి.