ఓటిటి ట్రెండింగ్ లో అదరగొడుతున్న “మహారాజ”

ఓటిటి ట్రెండింగ్ లో అదరగొడుతున్న “మహారాజ”

Published on Jul 16, 2024 10:01 AM IST

కోలీవుడ్ వెర్సటైల్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన రీసెంట్ చిత్రమే “మహారాజ”. మరి ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమాగా రాగా ఇది తన కెరీర్ లో ఒక మర్చిపోలేని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి ఈ చిత్రం థియేటర్స్ లో 100 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని రీసెంట్ గానే ఓటిటిలో వచ్చింది.

ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం గత వారం రిలీజ్ కి రాగా ఇప్పుడు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ ట్రెండ్స్ లో అదరగొడుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియా లోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ నిలిచింది. అలాగే ఓటిటిలో చూసినవారు కూడా ఈ చిత్రానికి మంచి ఫీడ్ బ్యాక్ ని అందిస్తున్నారు. దీనితో అటు థియేటర్స్ లోని ఇటు ఓటిటిలో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు