తమిళ సినిమా నాట అత్యంత సహజంగా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు వెట్రిమారన్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలా తన నుంచి గత ఏడాది రిలీజ్ అయ్యిన చిత్రమే “విడుదలై పార్ట్ 1”. మరి తమిళ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ముఖ్య పాత్ర చేసాడు. మరి తెలుగులో “విడుదల” గా రిలీజైన ఈ చిత్రం తెలుగు లో కూడా మంచి సక్సెస్ అందుకోగా పార్ట్ 2 కోసం తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా మొదటి పార్ట్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ పై విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మొదటగా పార్ట్ 1 కి గాను కేవలం 8 రోజులు మాత్రమే షూట్ చేస్తే ఇప్పుడు ఇది కాస్తా పార్ట్ 2 కి 100ల రోజులు దాటింది అని అది ఇంకా కొనసాగుతుంది అని తెలిపాడు. మరి దీనికి కారణం సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేయడం వల్ల అని తెలిపాడు. అయితే ఈ కామెంట్స్ తో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. వెట్రిమారన్ ప్లానింగ్ అసలు ఏం బాలేదని ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈ చిత్రం ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉండడంతో సోషల్ మీడియా తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు కంప్లీట్ అయ్యి రిలీజ్ కి వస్తుందో చూడాలి.