బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్న విజయ్ సేతుపతి “మహారాజ”

బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్న విజయ్ సేతుపతి “మహారాజ”

Published on Jun 16, 2024 5:30 PM IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యొక్క 50వ చిత్రం మహారాజ జూన్ 14, 2024న థియేటర్ల లోకి వచ్చింది. రిలీజైన తొలిరోజు నుండే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టడం జరిగింది. ప్రముఖ టికెటింగ్ యాప్ అయిన బుక్ మై షో లో మొదటి రోజు 114.32కే టికెట్లు అమ్ముడు కాగా, రెండో రోజు 199కే టికెట్లు అమ్ముడు అయ్యాయి. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ చిత్రం మరింత వసూళ్లను రాబట్టడం ఖాయం.

విజయ్ సేతుపతి నుండి సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూసిన అభిమానులకు మంచి ట్రీట్ ఇది. కురంగు బొమ్మై చిత్రానికి ప్రసిద్ధి చెందిన నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు