సేతుపతిని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు.!

Published on Oct 18, 2020 8:02 pm IST

తమిళ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన కష్టంతో తమిళ ఇండస్ట్రీలో పైకి వచ్చి మంచి నటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ కామన్ ఆడియెన్స్ లో అపారమైన ఆదరణను అందుకున్న ఈ టాలెంటెడ్ హీరో ఇపుడు తాను ఎంచుకున్న తాజా చిత్రం కారణంగా అపకీర్తి పాలవుతున్నారు.

శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రపై “800” అనే చిత్రంలో నటించడానికి ఒప్పుకున్న దగ్గర నుంచి సేతుపతికి ఇబ్బందులు తప్పలేదు. ఈ సినిమా చెయ్యకూడదని అతనికి వ్యతిరేఖంగా తమిళులు పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రెండ్ చెయ్యడమే కాకుండా ఇప్పుడు మరింత తీవ్ర స్థాయిలో సేతుపతిపై విరుచుకుపడుతున్నారు.

విజయ్ సేతుపతి తమిళ ద్రోహి అంటూ సోషల్ మీడియాలో #TamilsTraitorVijaysethupathi హ్యాష్ ట్యాగ్ తో దేశ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.మొన్ననే ముత్తయ్య మురళీధరన్ ఇదంతా ఆపాలని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి తోడు ఇటీవలే ఇచ్చిన ఒక యాడ్ మూలాన కూడా విజయ్ కు కొత్త చిక్కులు వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో ఇన్నాళ్లు ఎంతగానో ఆదరించిన తమిళ జనం సేతుపతిని ఇప్పుడు దారుణంగా టార్గెట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More