షాకింగ్ రన్ టైంతో వచ్చిన “విడుదల 2”?


కోలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ దర్శకుల్లో వెర్సటైల్ దర్శకుడు వెట్రిమారన్ కూడా ఒకరు. మరి వెట్రిమారన్ తెరకెక్కించిన రీసెంట్ హిట్ చిత్రం “విడుదల 1” తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. కమెడియన్ సూరి హీరోగా పరిచయం అయ్యిన ఈ సినిమా తనకి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడో 2022 లో వచ్చింది కానీ దీనికి సీక్వెల్ మాత్రం ఇంకా రాలేదు.

మొదట్లో చాలా తక్కువ బడ్జెట్ అండ్ స్కేల్ లోనే అనుకున్నారు కానీ ఉండగా ఉండగా సినిమా పెద్దది అయిపోతూ వచ్చింది. ఇలా ఇప్పుడు పార్ట్ 2 కి భారీ రన్ టైం వచ్చినట్టుగా టాక్ వినిపిస్తుంది. దీనితో ఒక్క పార్ట్ 2 తీసిన ఫుటేజ్ నాలుగున్నర గంటల పాటు వచ్చిందట. దీనితో మళ్ళీ దీనిని మూడో పార్ట్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా కొత్త టాక్. మెయిన్ గా విజయ్ సేతుపతిపై కంప్లీట్ గా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇలా మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉందని టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version