స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ ఇదే..!

స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ ఇదే..!

Published on Sep 14, 2024 10:01 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ రీసెంట్‌గా ‘ది గోట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా, ఈ చిత్రానికి మిక్సిడ్ టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు అందరూ విజయ్ తన లాస్ట్ మూవీని ఎవరితో చేస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. థళపతి విజయ్ తన లాస్ట్ సినిమా అని చెబుతున్న ‘థళపతి 69’ని దర్శకుడు హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈమేరకు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. చేతిలో కాగడా పట్టుకుని ప్రజాస్వామ్యానికి టార్చ్‌బేరర్‌గా ఈ సినిమాలో హీరో కనిపించబోతున్నట్లు ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2025లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు