తమిళ స్టార్ హీరో విజయ్ నటించనున్న 63వ చిత్రం యొక్క సెట్స్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కానుంది. విజయ్ కి ‘తెరి ,మెర్సల్’ చిత్రాల రూపంలో బ్లాక్ బ్లాస్టర్ విజయాలను అందించిన యువ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడని చెన్నై సినీ వర్గాల కథనం. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక నటించనుంది. భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుంది.
ఇక విజయ్ నటించిన పొలిటికల్ ఎంటర్టైనెర్ ‘సర్కార్’ నిన్నటి తో 25వ రోజులను పూర్తి చేసుకుంది. ఈచిత్రం తో విజయ్ మరోసారి బాక్సాఫిస్ వద్ద తన సత్తా చాటాడు.