మిల్కీ బ్యూటీ తమన్నా ‘MCA’ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ వర్మతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ జంటగా ఓ దివాళి ఈవెంట్ లో పాల్గొన్నారు. సినీ ప్రొడ్యూసర్ రమేశ్ తౌరాణి నిర్వహించిన ఈ ఈవెంట్‌లో తమన్నా పింక్ కలర్ డ్రెస్‌లో అలరించింది. ప్రస్తుతం తమన్నా – విజయ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తమన్నా – విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, బాలీవుడ్ మీడియాలో కూడా ‘తమన్నా – విజయ్ వర్మ’ల పెళ్లి పై మాత్రం చాలా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ, తన పెళ్లి పై జరుగుతున్న ప్రచారానికి తమన్నా ఫుల్ స్టాప్ పెడుతుందా ? లేక, నిజమే అని క్లారిటీ ఇస్తుందా ? అనేది చూడాలి.