త్వరలో థలపతి విజయ్ చివరి మూవీ అనౌన్స్ మెంట్!


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల విడుదలైన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన దాదాపు 400 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. విజయ్ త్వరలో ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి రానున్న సంగతి తెలిసిందే. నటుడి చివరి చిత్రం, తాత్కాలికంగా థలపతి69 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రానికి హెచ్.వినోత్ దర్శకత్వం వహించనున్నారు. మోస్ట్ అవైటెడ్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

ఈ ప్రాజెక్ట్ గురించి ప్రెస్ నోట్ ఇలా ఉంది. “ఎక్కువగా ఎదురుచూస్తున్న #Thalapathy69 ప్రకటన త్వరలో వెలువడుతుంది. ఇన్నాళ్లూ మనల్ని అలరించిన వ్యక్తికి ఇది చివరి చిత్రం కానుంది. ఈ కాంబో అత్యంత వినాశకరమైనది, మరియు ఇంతకంటే బెటర్ గా ఏదీ ఉండదు.” అని ఉంది. తమిళ ఫిల్మ్ సర్కిల్స్‌లో కొనసాగుతున్న బజ్ ప్రకారం, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర కోసం లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజుని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా తమిళ చిత్రసీమలో ఎలాంటి సందేహం లేకుండా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.

Exit mobile version