విజయ్ ‘లైగర్’ బడ్జెట్ ఎంతంటే..

Published on Jan 18, 2021 10:11 pm IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తు తెలిసిందే. ‘లైగర్’ అనేది ఈ సినిమా టైటిల్. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న పెద్ద బడ్జెట్ సినిమా ఇదే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు అవుతున్న ఖర్చు 125 కోట్లని తెలుస్తోంది. విజయ్ కెరీర్లో మొదటిసారి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే.

తెలుగుతో పాటు హిందీలో కూడ రూపొందుతోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయకిగా నటిస్తోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను త్వరలోనే రీస్టార్ట్ చేస్తున్నారు. రమ్యకృష్ణ లాంటి స్టార్ నటీనటులు ఇందులో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :