విజయ్ సినిమా సీక్వెలేనట

విజయ్ సినిమా సీక్వెలేనట

Published on Mar 20, 2020 10:05 AM IST

ఇలయదళపతి విజయ్ తన తర్వాతి చిత్రాన్ని ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే దీని మీద అఫీషియల్ క్కన్ఫర్మేషన్ రానుంది. అయితే గతంలో ‘తుపాకి, కత్తి, సర్కార్’ లాంటి సామాజిక సందేశం ఉన్న కమర్షియల్ ఎంటెర్టైనర్లు చేసిన ఈ ఇద్దరూ ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటారో అనే చర్చ మొదలైంది అభిమానుల్లో. తాజా సమాచారం మేరకు ఈసారి చేయబోయేది కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరేనని తెలుస్తోంది.

అంతేకాదు స్టోరీ ‘తుపాకి’ తరహాలోనే ఉంటుందని, టైటిల్ ‘తుపాకి 2’ అని, ఇది తప్పకుండా సీక్వెలేనని కోలీవుడ్ వర్గాల టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ యేడాదిలోనే ఈ సినిమా విడుదలకానుంది. ఇందులో ఇతర తారాగణం ఎవరు, రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ విడుదలకు రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు