విజయ్ “ది గోట్” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

విజయ్ “ది గోట్” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

Published on Sep 1, 2024 10:02 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ది గోట్ చిత్రం సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ దేశ వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. మేకర్స్ ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే ప్రారంభం కానుంది.

AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో స్నేహ, జయరామ్, లైలా, యోగిబాబు, అజ్మల్ అమీర్, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు