భారీ రన్ టైమ్ తో విజయ్ “ది గోట్”

భారీ రన్ టైమ్ తో విజయ్ “ది గోట్”

Published on Aug 23, 2024 10:01 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ది గోట్ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కొద్ది రోజుల క్రితం విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు వారు ఇచ్చారు. ఈ చిత్రానికి భారీ రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం 179 నిమిషాలు (2 గంటల 59 నిమిషాలు) నిడివితో ఉంది. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, యోగి బాబు, జయరామ్, మోహన్, వైభవ్, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మనోబాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్ మరియు కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు